టీవీ డిబేట్‌లో అవమానం: యాంకర్ తీరు హృదయాన్ని కలిచేసిందన్న నేత

తనపై జరుగుతున్న విష ప్రచారాలు, పిచ్చి రాతలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రముఖ రాజకీయ నేత. ఇటీవల జరిగిన టీవీ డిబేట్‌లో తనను అతిథిగా కూడా గౌరవించకుండా, తాను జూమ్ ద్వారా పాల్గొంటున్న విషయాన్ని సైతం పట్టించుకోకుండా, “Get out from my debate” అంటూ పదే పదే అవమానించిన తీరు తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు.

తాను ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కీలక పార్టీకి జనరల్ సెక్రటరీగా, ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యుడిగా ఉన్న స్థాయిని పూర్తిగా విస్మరించి, ఎప్పుడూ వినకూడని భాషను ఒక యాంకర్ ఉపయోగించడం దుర్మార్గమని మండిపడ్డారు. వందలాది టీవీ డిబేట్లు, మీడియా సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ తాను ఎక్కడా అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగించలేదని స్పష్టం చేశారు.

అతిథిని గౌరవించాల్సిన బాధ్యత యాంకర్‌కు ఉండాల్సినప్పటికీ, ఆవేశంతో స్పందించి వ్యక్తిగత అవమానానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల ప్రతినిధిగా తన స్థాయిని ఈ విధంగా దిగజార్చడం బాధాకరమని అన్నారు.

ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలు ఒక్కతాటిపైకి వచ్చి స్పందించిన తీరు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆ ఛానల్ ప్రవర్తనను ఏకగ్రీవంగా ఖండించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే, ఆ ఛానల్‌ను పార్టీ కార్యక్రమాల నుంచి నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, అలాగే పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *