Headlines

నల్గొండ అభివృద్ధికి కొత్త దిశ — ట్రాఫిక్ నియంత్రణ, పేద వ్యాపారులకు షాపులు, అండర్‌గ్రౌండ్ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం

పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చిన్న వ్యాపారులు, పేదవర్గాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా షాపుల ఏర్పాటుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించింది. పాత కలెక్టర్ కార్యాలయం సమీపంలో కొత్త షాపుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, వ్యాపారులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా…

Read More

తెలంగాణలో అసలు ప్రజా సమస్యలు పక్కనబెట్టి చిన్న విషయాలపై హంగామా — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

డిజిటల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ల పాత్రపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చిన్న చిన్న విషయాలను అతిశయోక్తిగా చూపిస్తూ పేదల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాజంలో విలువలు తగ్గిపోవడానికి ఇదీ ఒక కారణమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్లు తక్కువ ధరకు అమ్ముకునే ఆహార పదార్థాలపై ప్రశ్నించడం కంటే, రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం, విద్యా వ్యవస్థ సమస్యలు, సంక్షేమ…

Read More

మున్సిపల్ ఫలితాల సంకేతం… అసెంబ్లీలోనూ హంగ్ పరిస్థితులేనా?

రాష్ట్రంలో ఇటీవల వెలువడిన పురపాలక ఎన్నికల ఫలితాలు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ దిశను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మూడో శక్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభావం పెరిగిన ప్రాంతాల్లో హంగ్ పరిస్థితులు కనిపించడం గమనార్హం. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా త్రిముఖ పోటీ తీవ్రతరం అయితే స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రావడం కష్టమని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కమలం బలపడిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి సీట్లకు…

Read More

కవిత ప్రభావం… బీఆర్ఎస్‌కు మైనస్ అయ్యిందా? పార్టీ భవిష్యత్తుపై చర్చలు

రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పాత్రపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆమె చర్యలు, వివాదాలు, పార్టీ అంతర్గత పరిణామాలు భారత రాష్ట్ర సమితి భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి ప్రజల్లో ఇంకా బలం ఉన్నప్పటికీ, నాయకత్వ స్థాయిలో స్పష్టమైన వ్యూహం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారంలో లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వినడంలో పార్టీ నేతలు వెనుకబడుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, సామాన్య వర్గాలతో ప్రత్యక్ష…

Read More

మున్సిపాలిటీల్లో హంగ్ రాజకీయాలు… కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆరోపణలు, బీసీ రిజర్వేషన్లపై డిమాండ్లు

రాష్ట్రంలోని 34 మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. వినకపోతే బెదిరింపులు, కొన్ని చోట్ల కిడ్నాప్ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మండిపడ్డారు. హంగ్ పరిస్థితులు ఏర్పడిన మున్సిపాలిటీల్లో కనీసం 10 చోట్ల అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత రాష్ట్ర సమితి నేతలు భావిస్తున్నట్లు తెలిపారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు…

Read More

ప్రజాసేవే లక్ష్యం… బడ్జెట్ కసరత్తు ప్రారంభం, హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి

గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము పాలకులు కాదని ప్రజాసేవకులమని అధికారంలోకి వచ్చినప్పుడే స్పష్టం చేశామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచినా ఉప్పొంగకుండా, ఓడినా కుంగిపోకుండా ప్రజల కోసం పని చేస్తామని అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తాండాలకు బీటీ రోడ్లు, పంచాయతీ భవనాలు, పాఠశాలలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నల్లమల ఫారెస్ట్లో 20…

Read More

నెంబర్ గేమ్ క్లైమాక్స్… మేయర్, చైర్‌పర్సన్ పీఠాల కోసం పార్టీల తలపడి పోరు

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్ మరియు చైర్‌పర్సన్ ఎన్నికల నెంబర్ గేమ్ కీలక దశకు చేరుకుంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపుతుండగా, తమకు బలం ఉన్న ప్రాంతాల్లో పీఠాలను కాపాడుకునేందుకు బీజేపీ మరియు బీఆర్‌ఎస్ పార్టీ సర్వశక్తులు వినియోగిస్తున్నాయి. హంగ్ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు…

Read More

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ… నిర్ణయాత్మకంగా మారిన జీవన్ రెడ్డి వర్గం

జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. హంగ్ పరిస్థితి ఏర్పడడంతో మున్సిపల్ పీఠం ఎవరి ఖాతాలో పడుతుందన్నది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి. ముఖ్యంగా ఎంఎల్సీ జీవన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే సంజయ్ వర్గాల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. హైకమాండ్ పరిస్థితిని సమీక్షిస్తూ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సవంత్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు నేతలతో వేరువేరుగా భేటీ అయ్యారు….

Read More

కరీంనగర్ కార్పొరేషన్‌లో ట్విస్టుల రాజకీయాలు… మేయర్ పీఠంపై అనిశ్చితి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మేయర్ పీఠం దాదాపు భారతీయ జనతా పార్టీ సొంతమవుతుందనే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీలో చేరిన 15వ డివిజన్ కార్పొరేటర్ విప్పుల సాయి జ్యోతి, ఆదివారం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. మొదట కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లి మద్దతు కోరగా, ఆరోగ్య కారణాలతో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిపోయిన సాయి…

Read More

ఇందూర్ రాజకీయాలపై బీజేపీ ధీమా… ప్రతిపక్షంలో ఉన్నా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం

ఇందూర్ రాజకీయాలపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ నుంచి మున్సిపల్ స్థాయి వరకు తమ ప్రభావం పెరిగిందని, గతంతో పోలిస్తే ప్రత్యర్థి పార్టీలను వెనక్కి నెట్టామని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ను పూర్తిగా బలహీనపరిచామని, కాంగ్రెస్‌పై కూడా ఆధిపత్యం సాధించామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల కోసం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చినా వెనక్కి తగ్గబోమని బీజేపీ స్పష్టం చేసింది. అధికారంలో ఉన్నవారిపై కేసుల విచారణలు వేగవంతం కావాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్…

Read More