తెలంగాణలో ఎల్నినో ముప్పు.. రైతులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి!
తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో రానున్న నెలల్లో నీటి కొరత, విద్యుత్ సంక్షోభం తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వర్షపాతం తగ్గడం, జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యాసంగి సీజన్లో వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని,…

