కేటీఆర్‌తో టచ్‌లో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు? గులాబీ గూటికి ‘ఘర్ వాపసీ’పై భారీ స్కెచ్!
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో మరికొందరు తిరిగి గులాబీ గూటికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం….

