బార్లు బంద్.. ప్రివిలేజ్ ఫీ పెంపుపై యజమానుల ఆగ్రహం | ఎక్సైజ్ కమిషనరేట్ ముట్టడికి పిలుపు
తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారుల ఆందోళనకు తెరలేచింది. లైసెన్స్ ప్రివిలేజ్ ఫీ విధానంలో మార్పులు, అదనపు ఆర్థిక భారం పెరగడాన్ని వ్యతిరేకిస్తూ బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సంఘం రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో భాగంగా బార్లు మూసివేసి, ఎక్సైజ్ కమిషనరేట్‌ను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. తాజా రిపోర్టింగ్ ప్రకారం తెలంగాణలో దాదాపు 1,700 రిజిస్టర్డ్ బార్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రివిలేజ్ ఫీ విధానాన్ని మార్చే ప్రతిపాదనపై అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం…

