తెలంగాణలో కాంగ్రెస్కు అసలు పోటీదారు ఎవరు? BRSనా, BJPనా? 2028 ఎన్నికలపై ఆసక్తికర చర్చ
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు? బీఆర్ఎస్నా, బీజేపీనా? 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఈ మూడు పార్టీల మధ్య రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పాలనను ప్రజలకు వివరించాల్సి ఉండగా, గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో తన రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరి కాంగ్రెస్కు గట్టి పోటీ…

