పార్టీ లైన్లో నడవాల్సిందే.. లేదంటే కొత్త నాయకత్వం.. తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం అల్టిమేటం?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర రాజకీయాలపై మరింత దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయ లోపాలు పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయంతో ఢిల్లీ అధిష్టానం పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా సంస్థాగత బలాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందులో…

