జమ్మికుంట చెక్‌డ్యామ్ పేలుడు వివాదం: బీఆర్‌ఎస్ డిమాండ్ — జుడిషియల్ ఎంక్వైరీ, దోషులపై కఠిన చర్య
జమ్మికుంటలో చెక్‌డ్యామ్ పేల్చిన ఘటనపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తోందని మండిపడుతూ, బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలిసి జుడిషియల్ ఎంక్వైరికి డిమాండ్ చేసింది. ఇరిగేషన్ అధికారులే ముందే ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు దర్యాప్తులో పురోగతి లేకపోవడాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచనలో భాగంగా కట్టిన చెక్‌డ్యామ్‌లు లక్షల ఎకరాలకు నీరు అందించి, గ్రౌండ్‌వాటర్ టేబుల్ పెరగడంలో కీలకపాత్ర పోషించాయని బీఆర్‌ఎస్ నేతలు గుర్తుచేశారు. వరదలు వచ్చినప్పుడు…

