రేడియల్ రోడ్ టెండర్లపై రాజగోపాల్ రెడ్డి ఫైర్.. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు, హైకోర్టులో కీలక పరిణామం!
తెలంగాణ కాంగ్రెస్లో రేడియల్ రోడ్-2 టెండర్ల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుటుంబానికి చెందిన సుషీ ఇన్ఫ్రా సంస్థకు తక్కువ ధరకు బిడ్ వేసినా టెండర్లలో అనర్హత వేటు వేశారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.600 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆయన వాదించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుందని కూడా ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు ఇంకా…

