తెలంగాణలో పెట్టుబడులకు నేనే గ్యారంటీ.. పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి పారిశ్రామికవేత్తకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి భద్రత కల్పిస్తామని, పెట్టుబడులకు తానే వ్యక్తిగతంగా గ్యారంటీగా ఉంటానని ప్రకటించారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. డిసెంబర్ 7, 8 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశాన్ని గురువారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య,…

