భార్య మోసం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.. కన్నబిడ్డను అమ్మేసి మరో పెళ్లికి సిద్ధమైన మహిళ
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మోసం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం, హయత్‌నగర్ పరిధిలోని కోహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు సరిత అనే యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఓ బిడ్డ జన్మించింది….

