బస్సులో ఎమ్మెల్యే తీరుపై దుమారం.. విద్యార్థినిని పదే పదే తాకిన వీడియో వైరల్!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఓ వైరల్ వీడియో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆర్టీసీ బస్సులో మహిళలు, విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహాలక్ష్మి పథకం పరిశీలనకు బస్సులో ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు…

