వాట్సాప్‌లో ‘దీపావళి గిఫ్ట్ రూ.8,000’ మెసేజ్‌తో జాగ్రత్త.. లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ రూ.8,000 దీపావళి కానుకగా అందిస్తోందంటూ వాట్సాప్‌లో నకిలీ సందేశాలు వైరల్ చేస్తున్నారు. ఈ మెసేజ్‌లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి వ్యక్తిగత, బ్యాంకు వివరాలు నమోదు చేస్తే ఖాతాలోని డబ్బులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. పండుగ సమయంలో ప్రజల ఆశలను…

Read Full News