ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఎన్నికల నోటిఫికేషన్‌పై ఈసీ కీలక ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పెండింగ్‌లో ఉన్న ఎన్నికల పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయబోమని ఎన్నికల సంఘం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. విజయారెడ్డి పిటిషన్‌తో కీలక మలుపు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పి. విజయారెడ్డి.. అప్పటి…

