బీజేపీ టికెట్ పేరుతో రూ.1.5 లక్షలు తీసుకున్నారు.. ఇప్పుడు బెదిరిస్తున్నారు: గీత ఆరోపణ
హైదరాబాద్లో కార్పొరేటర్ ఎన్నికల టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన వద్ద నుంచి రూ.1.5 లక్షలు తీసుకుని మోసం చేశారని గీత అనే మహిళ ఆరోపించారు. ఈ వ్యవహారంలో భూసపు శంకర్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకుని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. గీత మాట్లాడుతూ, తాను డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించానని తెలిపారు. ఈ క్రమంలో భూసపు శంకర్ అనే వ్యక్తిని కలిశానని, ఆయనను బీజేపీ నాయకుడిగా తనకు పరిచయం…

