నిరుద్యోగుల కోసం 18 కేసులు.. రెండుసార్లు జైలు! MLC ఎన్నికల్లో గెలుపుపై అశోక్ సార్ ధీమా
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిపై రాజకీయ చర్చ వేడెక్కుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని చెబుతున్న అశోక్ సార్, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కేవలం ఎనిమిది రోజులే ప్రచారానికి సమయం ఉన్నప్పటికీ వేలాది మంది పట్టభద్రుల మద్దతు పొందానని, ఈసారి ఐదున్నర నుంచి ఆరు నెలల సమయం…

