సింగరేణి కార్మికుల హక్కులపై బీఆర్ఎస్ ఫైర్.. కోల్ బ్లాక్స్, ఐటీ పర్క్స్, డిపెండెంట్ ఉద్యోగాలపై కేంద్ర-రాష్ట్రాలకు అల్టిమేటం
సింగరేణి కార్మికుల సమస్యలు, తెలంగాణ బొగ్గు బ్లాకుల కేటాయింపు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. తెలంగాణలోని గోదావరి వ్యాలీలో ఉన్న కోల్ బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని బహిరంగంగా డిమాండ్ చేశారు. తెలంగాణ భూమి నుంచి వెలికితీసే బొగ్గు తెలంగాణ ప్రజలకే, ముఖ్యంగా సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఈ డిమాండ్ కొత్తది కాదని, 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు సవరణలు చేసిన…

