విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. లిక్విడ్ స్టీల్ లీక్‌తో 8 మంది కార్మికుల మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న లిక్విడ్ స్టీల్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉత్పత్తి విభాగంలో లిక్విడ్ స్టీల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకోగా, ఇతర ఉద్యోగులు సురక్షిత…

