జనసేనలోకి వినయ్ విప్లవ్.. పవన్ కల్యాణ్ నాయకత్వంపై నమ్మకం! డబ్బులు తీసుకుని పార్టీ మారలేదు
హైదరాబాద్: విద్యార్థి ఉద్యమాలు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నాయకుడు వినయ్ విప్లవ్ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, గతంలో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడిన వినయ్ విప్లవ్ అకస్మాత్తుగా జనసేనలో ఎందుకు చేరారు? తెలంగాణలో జనసేనపై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయాల మధ్య ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పార్టీ మారడానికి డబ్బులు తీసుకున్నారన్న విమర్శలకు ఆయన సమాధానమేంటి? ఈ ప్రశ్నలకు…

