తెలంగాణలో రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం.. ప్రతి ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలి: బీఆర్ఎస్ నేత డిమాండ్
తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నేత తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో కాంగ్రెస్ చేసిన విమర్శలకు ప్రస్తుత పరిస్థితులే సమాధానమని పేర్కొంటూ, గోదావరి, కృష్ణా నదుల నుంచి సుమారు 1,000 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారని ఆరోపించారు. సాగునీటిని సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చిందని…

