మద్దూర్లో అర్ధరాత్రి బుల్డోజర్లు.. రోడ్డు విస్తరణపై తీవ్ర దుమారం
నారాయణపేట జిల్లా మద్దూర్లో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు, దుకాణాల కూల్చివేత తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయంగానూ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్దూర్ మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ నుంచి చింతలదిన్నె వైపు వెళ్లే రహదారి విస్తరణలో భాగంగా అధికారులు ఇళ్లు, దుకాణాలను తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి. హిటాచీలు, టిప్పర్లతో పాటు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టినట్లు…

