ఎర్రవల్లి భూములపై భూ సర్వే.. జన్వాడ ఫార్మ్‌హౌస్‌పై ప్రదీప్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో ఎర్రవల్లి భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి పరిసరాల్లోని 325 సర్వే నంబర్‌కు సంబంధించిన సుమారు 388 ఎకరాల భూములపై అధికారులు భూ సర్వే కొనసాగిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు భూముల హద్దులు, పాత రికార్డులు, కేటాయింపులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఐదు బృందాలతో భూ సర్వే ఎర్రవల్లి, వెంకటాపూర్, యూసుఫ్గానిపల్లి, గంగాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో…

