రేగా కాంతారావుపై అత్యాచారం కేసు.. పెళ్లి పేరుతో మోసం చేశారంటూ యువతి ఫిర్యాదు
బీఆర్ఎస్ నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేశారంటూ ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని రేగా కాంతారావు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 22…

