ఓటర్ల జాబితాపై ఆధారాలుంటే ఈసీ వద్దకు రండి.. బీజేపీ నేత రవికుమార్ సవాల్!
హైదరాబాద్: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (SR), ఓట్ల తొలగింపు అంశాలపై రాజకీయ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వారి పేర్లు తొలగించారంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు నిర్దిష్ట ఆధారాలతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆయన సవాల్ విసిరారు. నిజంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయి ఉంటే వాటిని తిరిగి చేర్పించేందుకు బీజేపీ కూడా సహకరిస్తుందని…

