హైదరాబాద్‌లో జనసేన సభకు అనుమతి నిరాకరణ.. రాజకీయ వేడి రాజేసిన పవన్ కళ్యాణ్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన జనసేన పార్టీ కీలక నాయకుల సమావేశానికి అనుమతి నిరాకరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గచ్చిబౌలిలో జరగాల్సిన ఈ సమావేశానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించబోతున్న తొలి ప్రధాన సమావేశం కావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా…

