పాలమూరు నీళ్లపై రాజకీయ రగడ.. ‘ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు?’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు
మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సాగునీటి అంశాలపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం చెలరేగింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించడం లేదంటూ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. పాలమూరు ప్రాంతానికి గత పదేళ్లలో ఏమీ చేయలేదని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, ప్రాజెక్టుల నిర్మాణం, రిజర్వాయర్ల అభివృద్ధి, పంప్‌హౌస్‌ల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయని వారు పేర్కొంటున్నారు….

