పెన్షన్ కోసం డబ్బులు అడుగుతున్నారా? వెరిఫికేషన్ పేరుతో అధికారులపై ఆరోపణలు
తెలంగాణలో కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియపై దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ సమయంలో కొందరు అధికారులు, స్థానిక నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయనే కారణంతో కొత్త పెన్షన్ రాదని కొందరు దరఖాస్తుదారులను భయపెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెన్షన్ మంజూరు చేయించేందుకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు…

