కాలువ పక్కనే ఉన్నా నీరు రావడం లేదు.. 2 ఎకరాలు ఎండిపోతున్నాయంటున్న రైతు
నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు భూమేష్ తన పొలానికి సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ప్రస్తుతం నీరు అందక పొలం పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి చేరుకుందని ఆయన చెబుతున్నారు. పొలానికి సమీపంలోనే చెరువు, కాలువ రైతు భూమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ పొలానికి సమీపంలోనే చెరువు కట్ట ఉందని, కాలువ కూడా తమ పొలంలోకి వస్తుందని…

