నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత.. బీఆర్ఎస్లో విషాదం
వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. నరసంపేట నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు, ఉద్యమ సహచరులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం, ఇటీవల గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని…

