భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు
తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

