ఓఎస్డీల మార్పులు.. నిరుద్యోగుల నిరసనలు.. సచివాలయంలో ఏం జరుగుతోంది?
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంత్రుల పేషీల్లో పనిచేసే ఆఫీసర్స్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)ల బదిలీలు, మార్పులు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా కీలక మంత్రుల వద్ద పనిచేస్తున్న పలువురు ఓఎస్డీలు తమ విధుల నుంచి తప్పుకోవడం, మరికొందరు తమ మాతృశాఖలకు తిరిగి వెళ్లడం, ఇంకొందరిని మంత్రులే పక్కన పెట్టారనే ప్రచారం సచివాలయ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయా? లేక మంత్రుల పనితీరుపై ముందస్తు అంచనాలతో…

