నిరుద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నాలు ఆపాలి: తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియకుండా మాట్లాడితే సహించం – అలేక్య బీసి ఉమెన్ స్టేట్ కన్వీనర్
అందరికీ నమస్కారం. నా పేరు అలేక్య. నేను బీసి ఉమెన్ స్టేట్ కన్వీనర్‌గా, ఒక అడ్వకేట్‌గా ఈ మాటలు చెబుతున్నాను.ఇటీవల నిరుద్యోగ సమస్యపై విట్టల్ గారు రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు, ఒక నిరుద్యోగి కుమారస్వామి మరణం నేపథ్యంలో వచ్చిన భావోద్వేగ స్పందన. ఆ మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా, వీడియో మొత్తం చూడకుండా, చిన్న క్లిప్ పట్టుకొని మీడియా ముందు వచ్చి కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం అత్యంత బాధాకరం. అసలు ఇది ఎక్కడి కల్చర్?చదువు,…

