కామారెడ్డిలో “మిల్లింగ్ కింగ్” ఎవరు? సివిల్ సప్లైస్ శాఖలో ధాన్యం కేటాయింపులపై ఆరోపణలు!
కామారెడ్డి జిల్లా సివిల్ సప్లైస్ శాఖలో ధాన్యం కేటాయింపులు, మిల్లర్ల వ్యాపారాలు, అధికారుల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని సుమారు పది మిల్లులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్న ఓ మిల్లర్ సంఘం నాయకుడి ప్రభావం శాఖ కార్యకలాపాలపై ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న మిల్లర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించాలంటే ఆయన మాట వినాల్సి వస్తోందని, లేదంటే ధాన్యం కేటాయింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి అధికారిక విచారణ…

