కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెన్షన్ ఆలస్యమవుతోందా? లబ్ధిదారుల ఆవేదన
తెలంగాణలో ఆసరా పెన్షన్ల చెల్లింపులపై లబ్ధిదారులు తమ సమస్యలను వెల్లడిస్తున్నారు. గతంలో ప్రతి నెలా 5వ తేదీలోపే పెన్షన్ అందేదని, ప్రస్తుతం నెలాఖరు వరకు ఎదురుచూడాల్సి వస్తోందని కొందరు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పెన్షన్ లబ్ధిదారులు.. పెన్షన్ ఆలస్యమైతే ఇంటి అద్దె చెల్లింపులు, కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారుతోందని తెలిపారు. పెన్షన్‌పైనే ఆధారపడే కుటుంబాలకు సమయానికి డబ్బులు అందకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. నెల మొదట్లో రావాల్సిన పెన్షన్…..

