19,892 MW పీక్ డిమాండ్.. తెలంగాణ పవర్ సెక్టార్‌పై హరీష్ రావుకు ఘాటు కౌంటర్!
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 19,892 మెగావాట్ల పీక్ పవర్ డిమాండ్ నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. అంటే తెలంగాణ విద్యుత్ డిమాండ్ ఇప్పుడు దాదాపు 20 వేల మెగావాట్లకు చేరుకుంది. ఇంత భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా నిర్వహించగలిగామని విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ పవర్ సెక్టార్లో ప్రైవేటీకరణకు సంబంధించిన చర్చలు, ఆరోపణలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా…

