రెండు లక్షల ఉద్యోగాలు మాటల్లోనే.. పోరాటంలోనే పరిష్కారం – మహాధర్నాలో నిరుద్యోగుల ఆగ్రహం
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై మూడోసారి నిర్వహించిన మహాధర్నా భారీ స్పందనను రాబట్టింది. గతంలో రెండు సార్లు ఐదువేల మందితో నిర్వహించిన ధర్నాల మాదిరిగానే ఈసారి కూడా సుమారు ఐదువేల మంది నిరుద్యోగ యువత పాల్గొని తమ ఆవేదనను గళమెత్తారు. ఈ మహాధర్నా కోసం నిరుద్యోగ మిత్రులు అహోరాత్రులు కష్టపడి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా అనుమతులు, ఏర్పాట్ల విషయంలో ఇంద్ర కీలక పాత్ర పోషించగా, కొడంగల్ రవి, కుమార్, బిల్సునగర్ ప్రాంతాల్లో యువతను సమీకరించారు. కయ్య వెంకటేష్‌తో పాటు…

