డిప్యూటీ సీఎం కుమారుడి నిశ్చితార్థం వివాదంలో తెలంగాణ రాజకీయాలు — ప్రజాభవన్ వినియోగంపై ప్రశ్నలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్లు, అభ్యర్థుల పోటీ, గ్రౌండ్ పొలిటిక్స్ హీట్‌లో ఉండగా — మరో అంశం తాజాగా ప్రజా చర్చకు కారణమైంది. నిన్న హైదరాబాద్‌లో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి కుమారుడి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, సెలబ్రిటీలు, కల్వకుంట్ల కవిత, మెగాస్టార్ చిరంజీవి తదితరులు హాజరయ్యారు. నిశ్చితార్థ…

