రూ.8,500 బస్–మెట్రో కాంబో పాస్.. సామాన్యుడికి ఉపయోగమా? మహిళలకు ఉచిత బస్సు ఉన్నప్పుడు మళ్లీ ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్సు–మెట్రో కాంబో ట్రావెల్ పాస్ ధరపై చర్చ మొదలైంది. నెలకు రూ.8,500గా నిర్ణయించిన ఈ పాస్ సామాన్య ఉద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రవాణాను ప్రోత్సహించడం, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం లక్ష్యంగా ఇలాంటి పాస్‌లను తీసుకొస్తే, వాటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు సంపాదించే ఉద్యోగులకు రూ.8,500 ప్రయాణ ఖర్చు భారంగా మారవచ్చని ఈ అంశంపై…

