రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది” – బీఆర్ఎస్ విమర్శలు
తెలంగాణలో రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ సరిపోతుందనే దిశగా రైతులను తీసుకెళ్తోందని విమర్శించింది. రైతు కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రైతు డిస్కం…

