బ్యాంకు ఉద్యోగులే మోసగాళ్లకు తోడా? ఆపరేషన్ ఆక్టోపస్-2లో 150 కోట్ల సైబర్ స్కాం బహిర్గతం
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రజలు నమ్మే బ్యాంకు వ్యవస్థలోనే కొంతమంది ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారని తాజా దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన “ఆపరేషన్ ఆక్టోపస్-2”లో ఈ భారీ మోసం బట్టబయలైంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు 350 అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850కు పైగా సైబర్…

