కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పార్టీ నేతలు, కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కోదండరాం వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను…

