సింగరేణి కార్మిక గర్జనకు BRS పిలుపు.. అక్టోబర్ 14న రామగుండంలో భారీ సభ!
తెలంగాణలో సింగరేణి కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, డిపెండెంట్ ఉద్యోగాలు, సింగరేణి ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వంటి అంశాలపై ఒత్తిడి పెంచేందుకు ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు ప్రకటించారు. అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటలకు రామగుండంలో నిర్వహించనున్న ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు….

