తేజస్వి వ్యాఖ్యలపై మౌనం: కాంగ్రెస్ ఎంపీలపై సొంత పార్టీలోనే ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంపై Tejashwi Surya చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను దేశ విభజనతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ సమయంలో పార్లమెంట్‌లో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు మౌనం పాటించడం మరింత వివాదాస్పదంగా మారింది. పార్లమెంట్‌లో తెలంగాణకు చెందిన సుమారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ, ఎవ్వరూ వెంటనే స్పందించి కౌంటర్ ఇవ్వకపోవడం పార్టీ లోపలే చర్చకు దారి తీసింది….

