యాసంగి పంట వేయొద్దంటున్న మంత్రులు.. రైతులకు భరోసా ఏదీ? | తెలంగాణ వ్యవసాయం

తెలంగాణలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని ప్రతిపక్ష విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు విద్యుత్ సరఫరాలో సమస్యలు, మరోవైపు సాగునీటి కొరత, ఎరువుల కోసం ఇబ్బందులు.. ఇంకోవైపు పంటలకు గిట్టుబాటు ధర, బోనస్‌పై స్పష్టత లేకపోవడంతో రైతులు సతమతమవుతున్నారని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో యాసంగి పంట వేయవద్దని మంత్రులు సూచించడం రైతుల్లో మరింత ఆందోళన కలిగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సాగునీటి వనరులపై ఒత్తిడి ఉన్నందున యాసంగిలో వరి సాగు చేసి నష్టపోవద్దని రెవెన్యూ మంత్రి…

Read Full News

500 గజాల్లోపు స్థలాలకు లైన్ క్లియర్? 22Aలో రైతుల భూముల సంగతేంటి?

హైదరాబాద్: తెలంగాణలో జీవో 59 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఇంటి నిర్మాణంతో ఉన్న 500 చదరపు గజాలు లేదా అంతకంటే తక్కువ విస్తీర్ణంలోని స్థలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. అయితే, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన వేళ,…

Read Full News