అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాడె మోశారు — స్మృతివనం ఏర్పాటు నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, కవి అందెశ్రీ (అసలు పేరు: అందె ఎల్లయ్య) ఇక లేరు. సోమవారం ఉదయం లాలాపేట్‌లోని తన నివాసంలో కుప్పకూలిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో తెలంగాణ సాహితీ, సాంస్కృతిక రంగాలన్నీ దుఃఖంలో మునిగిపోయాయి. అందెశ్రీ అంతిమయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు సాగిన అంతిమయాత్రలో ప్రజలు, అభిమానులు, కవులు కన్నీరుమున్నీరయ్యారు….

