తెలంగాణలో మళ్లీ కరెంట్ కష్టాలా? అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. సస్పెన్షన్లు తప్పవా?
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలు, రానున్న రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎందుకు కొనసాగుతున్నాయని, పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను ఆయన ప్రశ్నించినట్లు కథనం పేర్కొంది. విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన సమయంలో ఎందుకు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడం లేదని నిలదీసిన సీఎం, నిర్లక్ష్యం వహిస్తే ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. విద్యుత్ కోతలకు…

