గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో 3 లక్షల కొత్త ఓట్లు? Gen Z ఎటువైపు.. పార్టీల్లో ఉత్కంఠ!
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, నల్గొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లను నమోదు చేయించేందుకు పార్టీలు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించాయి. కాల్ సెంటర్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, మండలాల వారీగా ఇన్ఛార్జ్ల నియామకం వంటి చర్యలతో గ్రాడ్యుయేట్ ఓటర్లను పెద్ద సంఖ్యలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి కొత్తగా నమోదయ్యే ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో…

