కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

