పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు.

“పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు.

ఒకవైపు మల్లారెడ్డి తన ఇంట్లో జరిగిన శుభకార్యానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి మనవడితో ఆయనకు కాళ్లు మొక్కించగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆయన అక్రమాలపై స్పందించకపోవడం సందేహాలు రేకెత్తిస్తోందని ఆమె విమర్శించారు.

కేవలం మల్లారెడ్డి మాత్రమే కాదు, కూకట్పల్లి — కుద్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో కూడా భూముల కబ్జాలు రాజకీయ నాయకుల చేతుల్లో జరుగుతున్నాయని కవిత ఆరోపించారు.

“ఉద్యమ కారుడు శాంబీపూర్ రాజుకి పదవి రాకుండా, బీటెక్ — బీటీ బ్యాచ్‌కే పదవులు దక్కాయి. ఇది ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం” అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

“ఉద్యమ కారుడు శాంబీపూర్ రాజుకి పదవి రాకుండా, బీటెక్ — బీటీ బ్యాచ్‌కే పదవులు దక్కాయి. ఇది ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం” అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

మేడ్చల్ జిల్లాలో ఇప్పటికీ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శమని కవిత అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు లేకపోవడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు.

“ఎన్నికల సమయంలో ఓట్లు అడుగుతారు. కానీ ప్రజా సమస్యలపై స్పందించరు… ఇది రాజకీయం కాదు, నిర్లజ్జత” అని ఆమె మండిపడ్డారు.

అయితే ప్రజల్లో మరో ప్రశ్న కూడా వినిపిస్తోంది:

“ఇవి అన్నీ అప్పుడే ఎందుకు చెప్పలేదు?

అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత, ఇప్పుడు రాజకీయ సందర్భంలో బయటకు అన్నీ చెప్పడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

కవిత మాత్రం దీనికి సమాధానమిస్తూ—

“నాకు అప్పట్లో మాట్లాడే స్వేచ్ఛ లేదు” అని అంటున్నారు.

ఇది నిజమైన ప్రజా పోరాటమా?
లేక రాజకీయ వ్యూహమా?
తెలంగాణ రాజకీయ వాతావరణంలో చర్చ మరింత వేడెక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *