లంచం తీసుకుంటూ పట్టుబడినా భయం లేదా? ఏసీబీ కేసులు మూసివేతపై ప్రభుత్వానికి ప్రశ్నలు!
భూ వారసత్వం కోసం రూ.5 లక్షల డిమాండ్.. తొలి విడతగా రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా పట్టివేత.. విద్యుత్ మీటర్ల కోసం రూ.1.20 లక్షల లంచం.. అవినీతి అధికారులపై చర్యలు ఎక్కడ? తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు, లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడుతుంటే.. మరోవైపు గతంలో నమోదైన అవినీతి కేసుల పరిష్కారం, నిందితులపై తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు…

